పంచ్ ప్రసాద్ కోసం.. అతని భార్య అంత త్యాగం చేసిందా?

praveen
ఇటీవలికాలంలో బుల్లితెరపై ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ తమదైన శైలిలో రాణిస్తూ అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారు ఆ తర్వాత కాలంలో మాత్రం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఉండడం గమనార్హం.  కేవలం జబర్దస్త్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ టీవీలో ప్రసారమయ్యే వివిధ బుల్లితెర కార్యక్రమాల్లో కూడా అలరిస్తూ ఉన్నారు ఎంతోమంది కమెడియన్స్.

 ఇలా జబర్దస్త్ కమెడియన్స్ లో బాగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు  అనే చెప్పాలి. ఎప్పుడూ తన ఆటో పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు పంచ్ ప్రసాద్. ఎవరు ఏది మాట్లాడినా ఆ వ్యాఖ్యలపై డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతూ ఆటో పంచులు వేస్తూ ఉంటాడు అని చెప్పాలి. తద్వారా అందరికీ అందరి కంటే కాస్త ఎక్కువగానే గుర్తింపు వచ్చింది. ఇకపోతే పంచ్ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. తన కెరియర్ లో ఏం జరిగింది అనే విషయాన్ని ఇటీవలే ఒక వీడియో రూపంలో చూపించారు.

 శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ప్రోమోలో భాగంగా పంచ్ ప్రసాద్ కోసం అతని భార్య ఎంత త్యాగం చేసింది అనే విషయాన్ని  పర్ఫామెన్స్ రూపంలో చూపించారు.  ప్రసాద్ అతని భార్య ప్రేమించుకున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే పెళ్లి చేసుకోవడానికి ముందు అతనికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఇలాంటి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు పంచ్ ప్రసాద్ తో పెళ్లికి అస్సలు అంగీకరించలేదు. కానీ ఆమె మాత్రం చావైనా బ్రతుకైనా అతనితోనే అని భావించి పెళ్లి చేసుకుంటుంది. కష్టాల్లొ సుఖాల్లొ తోడు ఉంటుంది.  ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి. ఈ విషయం తెలిసి పంచ్ ప్రసాద్ కోసం అతని భార్య ఇంత త్యాగం చేసిందా అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: