'నాని ' బాట లో 'నాగ శౌర్య'...... విజయం వరిస్తుందో... ? లేదో..... ?

murali krishna
నాని , నజ్రియా కాంబినేషన్‌లో రీసెంట్‌గా వచ్చిన చిత్రం 'అంటే సుందరానికీ' . ఈ సినిమా టాక్ బాగున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం హిట్టు చిత్రంగా నిలబడలేకపోయింది.
అందుకు కారణాలు ఏమిటనేది పక్కన పెడితే.. ఇందులో నాని బ్రాహ్మణ పాత్రలో అద్భుతంగా నటించి.. మంచి మార్కులు కొట్టేశాడు. నజ్రియా కూడా తనదైన నేచురల్ నటనతో పర్వాలేదు అనిపించుకుంది . అయినా కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలబడలేదు. ఇప్పుడు నాని బాటలోనే మరో యంగ్ హీరో అయినటువంటి నాగశౌర్య కూడా నడుస్తున్నాడు. బ్రాహ్మణ బ్యాక్‌డ్రాప్‌లో 'కృష్ణ వ్రింద విహారి' అంటూ సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ మధ్యనే విడుదల చేశారు. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ట్రైలర్ వరకు మాత్రం చాలా మంచి స్పందనే వస్తోంది.
అయితే నాని బ్రాహ్మణ యువకుడిగా కనిపించి.. అంతగా ఎంటర్‌టైన్ చేసినా కూడా హిట్టు కొట్టలేకపోయాడు.. ఇప్పుడు హీరో నాగశౌర్య హిట్టు కొడతాడా? అని 'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్ విడుదల తర్వాత సోషల్ మాధ్యమాలలో టాక్ వినిపిస్తుండటం గమనార్హం . ఇప్పుడున్న పరిస్థితులు.. ప్రతి హీరోకి ఛాలెంజ్ లాంటివి. మంచి కంటెంట్ ఉంటే తప్ప .. ప్రేక్షకులు ఆ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు మరియు ఇంట్రస్ట్ చూపించడం లేదు . నాగశౌర్య ఎంతో కష్టపడి, బాడీ బిల్డప్ చేసి మరీ నటించిన 'లక్ష్య' చిత్రాన్ని కూడా ప్రేక్షకులు పక్కన పెట్టేశారు. ఆ సినిమా తర్వాత వస్తున్న ఈ చిత్రం ఆయన కెరీర్‌కి ఎంతో ముఖ్యమైనది. సొంత నిర్మాణ సంస్థ ఉండి.. సినిమాలు ఎన్ని చేసినా కూడా హిట్టు ఉంటేనే.. నాగశౌర్య కూడా లిస్ట్‌లో ఉంటాడు. లేదంటే.. ఈ మధ్య వస్తున్న కొందరు యంగ్ హీరోల్లానే సైడ్‌కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ 'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్ మాత్రం.. ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తుందనేలా చేయడంలో సక్సెస్ అయింది. చిత్రయూనిట్ కూడా సినిమాని బాగా ప్రమోట్ చేసేందుకు సంసిద్ధం అవుతున్నారు. 'అంటే సుందరానికీ' సినిమాలో నానీనే అంతా.. కానీ ఇందులో నాగశౌర్యతో పాటు మరో మూడు పాత్రలు కూడా ఎంటర్‌టైన్ చేయనున్నాయనేలా ట్రైలర్ అయితే తెలియజేస్తోంది. సో.. చూద్దాం.. సుందరం వల్ల కానిది.. ఈ కృష్ణ వల్ల అవుతుందేమో..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: