యష్ తర్వాత సినిమా ఏం చేస్తున్నాడు!!

P.Nishanth Kumar
గతంలో కన్నడ చిత్ర పరిశ్రమ అంటే చిన్న కుటీర పరిశ్రమగా భావించే వారు ప్రతి ఒక్కరు. అక్కడి నుంచి వచ్చే సినిమాలు సైతం మీడియం రేంజ్ లోనే ఉండేవి. అయితే ఎప్పుడైతే యష్ కెజిఎఫ్ సినిమా చేసి భారీ విజయం సాధించాడో అప్పటినుంచి అక్కడినుంచి వచ్చే సినిమాల పద్ధతి పూర్తిగా మారిపోయింది. కెజియఫ్ సినిమాతో చరిత్ర సృష్టించాడు కన్నడ యంగ్ హీరో యష్. ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి రేకాదులను టచ్ చేసిన ఈ సినిమా తర్వాత దర్శకుడికి, హీరో కి వేరే లెవెల్ క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. అలాంటి ఈ సినిమా సైలెంట్ గా వచ్చిన ఈసినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసింది.
తొలిభాగమే చరిత్ర సృష్టించింది అంటే రెండో భాగం ఇంకా సంచలనం సృష్టించింది. తొలిభాగం విజయం సాధించిన తీరుకు సెకండ్ ఛాప్టర్ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించి ఈ హీరో ను పెద్ద హీరో ని చేసింది. ఈ నేపథ్యంలో ఈ హీరో ఇప్పుడు చేసే తదుపరి సినిమాపై అందరి దృష్టి పడింది.
ఎప్పటినుంచి అయన తదుపరి సినిమా గురించి వార్తలు వస్తున్నా కూడా ఆ సినిమా కి ఎవరు దర్శకుడు, ఎప్పుడు మొదలవుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. దాంతో యష్ అభిమానులు ఎంతో టెన్షన్ పడుతున్నారు. నర్తన్ అనే ఓ దర్శకుడితో అయన సినిమా చేయడానికి చూస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా ఒకే అయ్యింది అంటున్నారు. తొందరలోనే ఈ సినిమా మొదలుకాబోతుంది అంటున్నారు. మరి ఈ సినిమా కథాంశం ఏంటి.. ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయం పై క్లారిటీ రానుంది. ఇప్పటికైతే ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయి లో చేయబోతున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: