మహేష్ తో మూవీ తర్వాత ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్న రాజమౌళి..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ తో దర్శకుడు గా కెరియర్ ని మొదలు పెట్టిన రాజమౌళి ఇప్పటి వరకు అనేక మూవీ లకు దర్శకత్వం వహించాడు. రాజమౌళి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా దాదాపు బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించింది. ఇలా ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి గొప్ప గుర్తింపు ను దక్కించు కున్నాడు.

ఇది ఇలా ఉంటే రాజమౌళి , ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బాహుబలి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించు కున్నాడు. ఇది ఎలా ఉంటే తాజాగా రాజమౌళి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి 1100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది .

ఈ మూవీ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే రాజమౌళి మరి కొన్ని రోజుల్లో మహేష్ బాబు హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తో సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి , ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: