ఒకే నటుడితో.. చెల్లిగా, కూతురిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ?

praveen
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే హీరోలు 60 ఏళ్లు వచ్చినా కూడా స్టార్ హీరోలుగానే కొనసాగుతూ ఉంటారు.  కానీ ఒక్క హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం అయింది అంటే చాలు సీనియర్ హీరోయిన్ అంటూ ముద్ర వేస్తూ ఉంటారు.. కొత్త హీరోయిన్ల రాకతో పాత హీరోయిన్లకు అవకాశాలు కూడా తగ్గిపోతూ వుంటాయి.. తద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఒకప్పుడు హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులుగా.. లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం వంటివి చేస్తూ ఉంటారు.

 ఇలా ఇటీవలి కాలంలో అవకాశాలు లేక చిత్ర పరిశ్రమలో కనుమరుగైన సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారిలో రమ్యకృష్ణ ముందు స్థానంలో ఉంది అని చెప్పాలి. తెలుగులో అప్పట్లో గ్లామర్ డాల్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది రమ్యకృష్ణ. టాప్ హీరోలందరితో కలిసి నటించింది. నీలాంబరి గా ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు నేటి తరం ప్రేక్షకుల గుండెల్లో శివగామి గా చెరగని ముద్ర వేసుకున్నారు.

 అయితే ఒక హీరోయిన్ హీరో కి చెల్లెలిగా భార్యగా కూతురు గా నటించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ రమ్యకృష్ణ మాత్రం ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహ సినిమాలో నీలాంబరి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది రమ్యకృష్ణ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ రామకృష్ణ అన్నయ్య పాత్ర చేశాడు. ఇక తమిళంలో సూపర్హిట్ అయిన వంత రాజవతాన్ వరి వేణు చిత్రంలో నాజర్ కూతురుగా కనిపించింది రమ్యకృష్ణ. అలాగే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో నాజర్ భార్యగా నటించింది.. ఇలా ఒకే నటుడితో చెల్లెలిగా కూతురిగా భార్యగా కూడా నటించింది రమ్యకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: