దుఃఖంతో కృష్ణంరాజు మృతి పట్ల ఎమోషనల్ అయిన చిరంజీవి..!!

Divya

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం తెల్లవారుజామున అస్తమించారు. సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టివేశారు. రెబల్ స్టార్ అభిమానుల్లో మాత్రమే కాకుండా యావత్ సినీ పరిశ్రమలో కూడా ఈ విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక కృష్ణంరాజు లేరు అనే పదం ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ కలిగిస్తోంది. కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.. తెలుగు సినిమా కథానాయకుడుగా, రాజకీయవేత్తగా,  నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు కృష్ణంరాజు. పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడి AIG ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ హుటాహుటిగా AIG హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇక కృష్ణంరాజు మృతి పై సినిమా తారలు సోషల్ మీడియా వేదికగా పలువురు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇక కృష్ణంరాజు మృతి పై చిరంజీవి స్పందిస్తూ.." కృష్ణంరాజు గారు ఇకలేరు అనే మాట తనకి చాలా విషాదకరంగా ఉంది..  చిత్ర పరిశ్రమలో తన తొలి రోజుల్లో నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో మన ఊరి పాండవులు దగ్గర నుంచి నేటి వరకు తనతో ఉన్న అనుబందం మరిచిపోలేనిది అని తెలియజేశారు. రెబల్ స్టార్ అనే పదానికి నిజమైన నిర్వచనం కృష్ణంరాజు గారు అని తెలిపారు.

కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు కృష్ణంరాజుగారు.. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకు సినీ పరిశ్రమకు ఎంతో మంది అభిమానులకు ఇది ఎప్పటికీ తీరని లోటు అని తెలియజేశారు. ఇక ఆయన ఆత్మకి మనశ్శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా తమ్ముడు ప్రభాస్ కి నా సంతాపం తెలియజేస్తున్నారని ఒక ఎమోషనల్ పోస్టు రాయడం" జరిగింది. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ కాస్త చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: