మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా , అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లో వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు.  ఈ మూవీ కి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించగా ,  జాక్స్ బీజాయ్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

ట్రైన్ ట్రావెలర్ జోనర్ లో ఈ మూవీ ని దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కించాడు  ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడంతో ఈ మూవీ కి మొదటి రోజు బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కాయి. మొదటి రోజు ఒకే ఒక జీవితం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ , 2.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇలా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసిన ఒకే ఒక జీవితం మూవీ మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసింది. ఒకే ఒక జీవితం మూవీ రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.55 కోట్ల షేర్ , 3.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఒకే ఒక జీవితం మూవీ మొదటి రోజు తో పోలిస్తే , రెండవ రోజు ఎక్కువ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో ఒకే ఒక జీవితం మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: