ఓనమ్ స్పెషల్ లుక్ లో అదరగొడుతున్న కీర్తి సురేష్..!!

Divya
మహానటి సినిమా తో ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ పొజిషన్లోకి చేరుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇక ఈ ముద్దు గుమ్మ ఎలాంటి కాస్ట్యూమ్స్ లో ఉన్నా కూడా అభిమానులు బాగా లైక్ చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఆమె ప్రతి ఫోటోషూట్ కూడా విపరీతంగా స్పందన వస్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఓనమ్ స్పెషల్ గా కేరళ సాంప్రదాయం లుక్ లో కీర్తి సురేష్ కనిపించి అభిమానులను సైతం ఆనందపరిచింది. కేరళ ట్రెడిషనల్ శారీ లో ఈ అమ్మడు సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నది. ఇక ఈమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈమె అభిమానులు నేటిజన్లు సైతం ఈ ఫోటోలు చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా స్క్రీన్ షో చేయడానికి ఇష్టపడదు ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు హాట్ ఫోటోలను మాత్రం విడుదల చేస్తోంది. కీర్తి సురేష్ తాజాగా చీరకట్టులో కనిపించి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేయడంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. కెరియర్ ప్రారంభంలో ఈ ముద్దుగుమ్మ స్కిన్ షో కి దూరంగా ఉండేది. కానీ మహేష్ బాబుతో నటించిన సర్కారు వారి పాట చిత్రంలో తన హద్దులను తానే సడలించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక సర్కార్ వారి పాట చిత్రంలో ఈమె అందాలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. మరి రాబోయే రోజుల్లో అంతకుమించి స్క్రీన్ షో ఉంటుంది అని ఆమె అభిమానులు సైతం భావిస్తున్నారు. అంతేకాకుండా ఈమధ్య కాలంలో ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాల పైన కూడా దృష్టి పెట్టింది కీర్తి సురేష్. కీర్తి సురేష్ కు అవకాశాలు రావడానికి ముఖ్య కారణం మహానటి చిత్రమే అని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా ఆ సినిమా కారణంగానే ఈమెకు పలు అవకాశాలు వెలుగు పడుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: