ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బన్నీ?

Purushottham Vinay
ప్రస్తుతం దేశమంతటా కూడా సౌత్ సినిమా సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది.బాహుబలి , కేజీఎఫ్2, ఆర్.ఆర్.ఆర్, పుష్ప, కార్తికేయ 2 చిత్రాలు.. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే తేడా లేకుండా విడుదల అయిన అన్ని చోట్లా రికార్డులు సృష్టించాయి.కంటెంట్ బాగుంటే ఏ హీరో సినిమాలయినా ఎక్కడైనా దుమ్మురేపుతుందని ప్రూవ్ అయిపోయింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యశ్, నిఖిల్ లాంటి లోకల్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ గా అవతరించారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్‌కు గట్టి పోటీ ఇచ్చే స్టార్స్‌గా ఎదిగారు. దాంతో ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ అనే బేధమే లేకుండా పోయింది. హీరోల కన్నా కంటెంటే ముఖ్యమని ఈ జెనరేషన్ ప్రేక్షకులు బలంగా నమ్మడంతో.. ఇప్పుడు ఇండియన్ సినిమా సరికొత్త టర్న్ తీసుకుంది.ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మ్యాజిక్ చేసిన చిత్రాలతో ఆయా హీరోల పారితోషికాలు కూడా ఓ రేంజ్‌లో పెరిగాయి. వీరిలో ప్రస్తుతం రూ. 100 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకొనే హీరోలున్నారు. అయితే 'పుష్ప' చిత్రంతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని, ఆ సినిమా సూపర్ సక్సెస్ తో అతడి పారితోషికం కూడా అందరికన్నా ఎక్కువ స్థాయికి చేరుకుందని వార్తలొస్తున్నాయి.


'పుష్ప' చిత్రంతో నార్త్ లో దాదాపు రూ. 330 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టిన బన్నీ.. ఈ సినిమా రెండో భాగం కోసం ఇండియాలోనే హైయస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా సరికొత్త రికార్డు నెలకొల్పాడని టాక్.ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో రూ. 125 కోట్ల పారితోషికం ఒకే సినిమాకి తీసుకుంటున్న హీరో సల్మాన్ ఖాన్. కాగా ఇప్పుడు అదే పారితోషికం అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ కూడా నిలిచిపోవడం విశేషంగా మారింది. అలా పారితోషికం అందుకుంటున్న రెండో హీరో బన్నీనే అని ఒక ప్రముఖ టీవీ చానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఒకవేళ అదే నిజమైతే.. సౌత్ లో రూ. 125 కోట్లు పారితోషికం అందుకొనే తొలి హీరోగా బన్నీ చరిత్ర సృష్టించడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పుష్ప 2 చిత్రం దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోనుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం వుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: