జిన్నా టీజర్: విష్ణు ఖాతాలో కంబ్యాక్ హిట్?

Purushottham Vinay
టాలీవుడ్ హీరో స్టార్ కిడ్ ఇంకా మా అధ్యక్షుడు మంచు విష్ణు గతేడాది 'మోసగాళ్ళు' సినిమాతో భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు.విష్ణు హిట్ కొట్టి చాలా రోజులు అవుతుండడంతో.. ఎలాగైనా 'జిన్నా' సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తోంది. ప్రముఖ రచయిత ఇంకా అలాగే నిర్మాత కోన వెంకట్ జిన్నా చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేయనున్నారు.ఇక జిన్నా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు విశేష స్పందన రాగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 9 సెకండ్ల నిడివి గల ఈ టీజర్‌.. రఘుబాబు డైలాగ్‌తో ఆరంభం అవుతుంది.

 '
ధూందాంగా పెళ్లి చేస్తున్నావ్.. టెంట్ హౌస్ ఎక్కడి నుంచి అడగ్గా.. ఇంకెవరు మీవోడే' అనే డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. 'వాడు టైంకే వస్తాడు.. వచ్చేప్పుడు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు కదా', 'వాడు పనికిమాలినోడమ్మా.. ఊరంత అప్పులు' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.మొత్తానికి టీజర్ కొంచెం ప్రామిసింగ్ గానే వుంది.ఈ టీజర్ చూస్తుంటే.. టెంట్ హౌస్ నడిపే మంచు విష్ణు లైఫ్‌లోకి బాలీవుడ్ నటి సన్నీ లియోని ఎంట్రీ ఇస్తుంది. సన్నీకి దెయ్యం పట్టినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. మరి ఆ దెయ్యం వెనుక కథ ఏంటి? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మంచు విష్ణు ఖాతాలో హిట్ పక్కా అనిపిస్తుంది. ఈ సినిమాలో విష్ణుకు జోడీగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటించారు. గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. జిన్నా సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమాతో విష్ణు హిట్ కొట్టి కంబ్యాక్ అవుతాడో లేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: