మంచి అవకాశాన్ని వదులుకున్న శర్వానంద్...!!

murali krishna
యంగ్ హీరో శర్వానంద్ సుదీర్ఘ కాలం తర్వాత ఒక డీసెంట్ సక్సెస్ సినిమా తో కెరియర్ లో మళ్ళీ నిలదొక్కుకున్నాడు. ఆ సినిమానే ఒకే ఒక్క జీవితం.. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అక్కినేని అమల కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.


ఇది ఒక టైం ట్రావెల్ నేపథ్యం స్టోరీ. విభిన్నమైన పాత్రలతో దర్శకుడు చేసిన ఈ ప్రయోగానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కింది కానీ వసూళ్ల విషయంలో నిరాశ తప్పదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే శర్వానంద్ గత చిత్రాల ఫలితం కారణంగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయితే దక్కలేదు. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అగ్రేసివ్‌ గా నిర్వహించ లేదు. అందుకే ప్రేక్షకుల్లో ఈ సినిమా కు పెద్దగా హైప్‌ అయితే క్రియేట్ కాలేదు.


సినిమా విడుదల తర్వాత ఎలాగూ మౌత్ టాక్ తో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ప్రేక్షకులలో ఆదరణ పెరిగే అవకాశం ఉంది. కానీ సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యే అవకాశం లేదని టాక్ వినిపిస్తుంది. ఒకవైపు బ్రహ్మాస్త్ర సినిమా ఉండడం వల్ల ఈ సినిమా కు ఎక్కువ స్థాయిలో థియేటర్లు కేటాయించలేక పోతున్నాం అంటూ బయ్యర్లు కూడా చేతులు ఎత్తేశారు. తీరా చూస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది.


ఇప్పుడు ఆ సినిమా వేసిన థియేటర్లలో కొన్నింటిని తీసి వేసి ఒకే ఒక జీవితం సినిమాను వేస్తే బాగుంటుంది అంటూ ఇప్పుడు కొందరు భావిస్తున్నారట. కానీ ఇప్పటికే ఆలస్యమైంది.. సినిమా ప్రమోషన్ భారీగా చేసి మంచి బయ్యర్లకు సినిమా ను అప్పగించి ఉంటే భారీ ఎత్తున విడుదల అయ్యేది, తద్వారా మంచి వసూలు నమోదు అయ్యేది అంటూ టాక్‌ కూడా వినిపిస్తుంది. ఒక మంచి అవకాశాన్ని శర్వానంద్ మిస్ చేసుకున్నాడని ఇలాంటి అవకాశం మళ్ళీ శర్వానంద్ కి ఎప్పుడు వస్తుందో అంటూ ఆయన అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: