ఆ హీరోయిన్ లు ఇక చేయరా!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల విషయానికి వస్తే ఇప్పుడు ఒక శకం ముగిసింది అనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఓ ఇద్దరు హీరోయిన్ లు ఒక సినిమాలో కూడా నటించకపోవడం వారికి సినిమా అవకాశాలు కూడా రాకపోవడం వంటివి జరగడంతో వీరి శకం ముగిసిందనే కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. కాజల్, అనుష్క ఇద్దరు కూడా రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

మంచి నటనతో పాటు గ్లామర్ కు కూడా ప్రాధాన్యత ఇస్తూ వారు ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని ఇప్పుడు ఎన్నో సినిమాలు ద్వారా ప్రేక్షకులను ఆలదించారు. ఈ నేపథ్యంలో కాజల్ పెళ్లి చేసుకొని దాదాపుగా సినిమా పరిశ్రమకు దూరం అన్నట్లుగానే సంకేతాలు ఇచ్చింది. దానికి తో డు ఆమెకు ఓ బాబు కూడా జన్మించడంతో ఇక ఆమె సినిమాలలోకి వచ్చే ఆలోచన పూర్తిగా మానేసిందని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో క్యారెక్టర్ ఆర్టిస్టు గా ఆమె ప్రేక్షకులు ముందుకు వస్తే ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు

ఇక అనుష్క కూడా బాహుబలి సినిమా తర్వాత ఒకటి రెండు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది కానీ హీరోయిన్ గా మాత్రం చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించలేదు. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించడం లేదు. మరి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన ఈ హీరోయిన్ మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఇప్పుడు సినిమాలలో నటించకపోవడం తెలుగు ప్రేక్షకులకు కొంత నిరాశను కలిగిస్తుందని చెప్పాలి. వారి వారి జీవితాలలో వారు తదుపరి దశకు చేరుకున్న నేపథ్యంలో వారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప ఎవరు ఏమీ చేయలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: