జబర్దస్త్ కమెడియన్స్ WWE.. చూస్తే నవ్వు ఆపుకోలేరు?

praveen
ఇటీవలి కాలం లో సినిమాలకు మించిన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉన్నాయి బుల్లితెర కార్యక్రమాలు. ఎప్పటికప్పుడు వినూత్న మైన కాన్సెప్ట్ తో వస్తూ ప్రేక్షకులను ఎప్పుడూ కొత్తగా అలరిస్తూనే ఉన్నాయి అని చెప్పాలి.. ముఖ్యం గా ఈ టీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలు ప్రతి వారం సరికొత్త స్కిట్లతో కడుపుబ్బ నవ్విస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయ్ అని చెప్పాలి. ఇలాంటి కార్య క్రమాల లో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఒకటి. ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

 ఇక ఇప్పుడు జబర్దస్త్ కంటే విభిన్నం గా సరి కొత్తగా ఎంటర్టైన్మెంట్ అందించాలనే ఉద్దేశం తో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది అని చెప్పాలి. ఇక పోతే ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. రాను రాను అంటుంది చిన్నదో అంటూ ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగం గా హీరోయిన్ సదా ని కూడా స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. ఈ ప్రోమో ఎప్పటి లాగానే ఎంతో సందడి సందడిగా సాగి పోయింది అని చెప్పాలి..

 అయితే జబర్దస్త్ కమెడియన్స్ ఎప్పుడు సరికొత్త స్కిట్లు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో లో భాగం గా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా అర్ధనగ్నం గా కనిపించారు. ఎందుకో తెలుసా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై నిర్వహించారు. ఈ క్రమం లోనే  జబర్దస్త్ కమెడియన్స్ చేసిన డబ్ల్యూ డబ్ల్యూ ఈ స్కిట్ మాత్రం అందరినీ పగలబడి నవ్వుకునేలా చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: