'ఒకే ఒక జీవితం' మూవీ ఫ్రీ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..!

Pulgam Srinivas
కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్ర లలో నటించే ఆ తర్వాత హీరో గా అవకాశాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ని కొనసాగిస్తున్న శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు.

ఈ మూవీ టైం ట్రావెలర్ జోనర్ లో తెరకెక్కింది. శ్రీ కార్తిక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , రీతు వర్మ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అక్కినేని అమల ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించగా , ప్రియదర్శి , వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని రేపు అనగా సెప్టెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ టికెట్ లు ఆన్లైన్ లో అందుబాటు లోకి వచ్చాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఒకే ఒక జీవితం మూవీ ఫ్రీ బుకింగ్ లు కాస్త తక్కువ గానే జరుగుతున్నాయి. కాక పోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత పాజిటివ్ టాక్ కనుక ఈ సినిమాకు వచ్చినట్లు అయితే ఆ తర్వాత ఈ సినిమాకు బుకింగ్ లు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు కూడా పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: