"ఒకే ఒక జీవితం" శర్వానంద్ లైఫ్ ను మారుస్తుందా ?

VAMSI
టాలీవుడ్ లో ఉన్న హీరోలలో శర్వానంద్ ఒకరు, కెరీర్ లో ఒక్కో సినిమా చేసుకుంటూ వచ్చి ఒక మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య చూసుకుంటే శర్వా కెరీర్ అస్సలు బాగాలేదు. ప్రతిసారి మంచి కథ అని నమ్మి ప్రాణం పెట్టి తీయడం... అది కాస్తా ప్రేక్షకులను మెప్పించలేక ఫెయిల్ అవడం జరుగుతూ ఉంది. శర్వానంద్ కెరీర్ లో ఆఖరిగా హిట్ అని చెప్పుకోవాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే అది శతమానంభవతి మాత్రమే. ఆఖరిగా తాను చేసిన సినిమా ఆడాళ్ళూ మీకు జోహార్లు సినిమా నిర్మాతలకు మరిచిపోలేని విధంగా నష్టాలను ఇచ్చింది.
ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమా మరో రెండు రోజుల్లో మీ అభిమాన థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ ను నిన్నే ప్రదర్శించారు...వీక్షించిన ప్రముఖ డైరెక్టర్ లు మరియు నిర్మాతలు మంచి కథ ని కామెంట్ చేయడం శర్వానంద్ కు మరింత నమ్మకాన్ని ఇచ్చిందట. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ లు జరుగుతున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేవట. కానీ చిత్ర బృందం మాత్రం మొదటి షో పూర్తి అయ్యాక బుకింగ్ అవే జోరును అందుకుంటాయి అంటూ విశ్వాసంతో ఉన్నారు.
ఈ సినిమాలో శర్వానంద్ మరియు రీతూ వర్మలు జంటగా నటించగా, అమల ప్రధాన పాత్రను పోషించింది. మిగిలిన పాత్రలలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ లు నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ కార్తీక్ ఎంతో హార్డ్ వర్క్ చేసి తెరకెక్కించారు. మరి వీరందరి కష్టం ఫలించి ఈ సినిమా శర్వానంద్ కు మంచి బూస్ట్ అప్ ఇచ్చి,  కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: