ఆర్య 'కెప్టెన్' కథ ఇదేనా.. ఈసారి హాలీవుడ్ రేంజ్ లో..!!

Anilkumar
తమిళ హీరో ఆర్య పలు తెలుగు సినిమాలతో ఇక్కడ కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.అయితే  ఇటీవలే సారపట్టు అనే సినిమాతో మంచి విజయం సాధించాడు.ఇదిలావుంటే తాజాగా మరో కొత్త కథతో రాబోతున్నాడు. అయితే ఆర్య హీరోగా నటించిన కెప్టెన్ సినిమా సెప్టెంబర్ 8న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇక మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజిబిజిగా ఉన్నారు.ఇకపోతే  ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూసి సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఇక హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.అంతేకాదు ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడాడు.అయితే  ఆర్య మాట్లాడుతూ.. ”ఈ డైరెక్టర్ తో గతంలోనే సినిమా చేశాను. ఈయనకి గ్రాఫిక్స్ మీద మంచి పట్టు ఉంది. అందుచేత  కెప్టెన్ సినిమా ఒప్పుకున్నాను. ఇక ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేశాం. అంతేకాదు కెప్టెన్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర చేశాను.ఈ సినిమా ఏంటంటే... ఓ వింత జీవితో పోరాటం చేయడమే కెప్టెన్ సినిమా కథ. ఇక కెప్టెన్, అతని బృందం ఆ వింత జీవితో ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? ఆ వింత జీవి వల్ల మానవాళికి ఎలాంటి ప్రమాదం ఉంది అనేదే ఈ సినిమా కథ.

అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలని నీటిలో 20 అడుగుల లోపు, కొన్ని భూమికి 100 అడుగులపైన చేశాము.  ఆ వింత జీవి అనేది గ్రాఫిక్స్ కాబట్టి అది ఉందనుకొని షూటింగ్ చేస్తాము. అప్పుడు యాక్టింగ్ చేయడం  కష్టం.”ఇకపోతే ”ఈ సినిమాలో ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌ ఉంది కాబట్టి ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా డీల్‌ చేశాం.అంతేకాదు  మాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే అది ఆర్మీ వాళ్ళని తక్కువ చేసినట్లుగా ఉంటుంది. అందు వల్లే అలంటి తప్పులు జరగకుండా సెట్ లో ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ను కూడా పెట్టుకున్నాం” అని తెలిపారు. ఇక హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో తమిళ్ నుంచి సినిమా రానుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: