మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' మరో బాహుబలి అవుతుందా..?

Anilkumar
ఒకప్పుడు దక్షిణాది సినిమాలు అంటే చాలా వరకు అందరూ చిన్నచూపు చూసేవారు.అయితే ఎప్పుడైతే  దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి వల్ల ఆ మార్క్ చెరిగిపోయింది. అంతేకాదు ఆ తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండ్ కూడా మారింది.అయితే భారీ బడ్జెట్ తో యాక్షన్, పీరియాడికల్ మూవీస్ తీశారు, తీస్తున్నారు.ఇక  అలా వచ్చిన వాటిలో త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2 లాంటి చిత్రాలు..బాక్సాఫీస్ దగ్గర బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. ఇదిలావుంటే ఇప్పుడు అలా బాక్సాఫీస్ వండర్ క్రియేట్ చేసేందుకు వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఇక ఇప్పుడు దీని ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేయగా, అది వావ్ అనిపిస్తోంది.

ఇదిలావుంటే ఇక పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే పదో శతాబ్దంలో చోళ సామ్రజ్యంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ‘పొన్నియన్ సెల్వన్-1’ చిత్రం.కాగా  ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.అయితే  “వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణ శకం ఉదయించక మునుపు… ఒక తోక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది.కాగా  చోళ రాజకులంలో ఒకరిని ఆ తోక చుక బలి కోరుతుందని అంటున్నారు.అయితే  దేశాన్ని పగలు, ప్రతీకారాలు చుట్టుముట్టాయి.

సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. 
వంచన, ద్రోహం రాజ మందిరంలోకి చొచ్చుకుని పోతున్నాయి” అని హీరో రానా వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.కాగా ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, చోళ రాజ్యరక్షకుడిగా జయం రవి కనిపించారు. ఇకపోతే వీళ్లతో పాటు కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్, పార్దిబన్ తదితరులు.. ఒక్కొక్కరు స్క్రీన్ పై కనిపిస్తుంటే అదే రీతిలో విజువల్స్ కూడా గ్రాండ్ గా అనిపించాయి.అంతేకాదు  ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాని మరో స్థాయిలో నిలబెట్టేలా కనిపిస్తోంది. అయితే సెప్టెంబరు 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. పీరియాడికల్ మూవీ అనగానే మనకు బాహుబలినే గుర్తొస్తుంది. ఇక అలాంటి సినిమాని పొన్నియన్ సెల్వన్ మరిపిస్తుందా అనేదా చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: