ప్రభాస్ తో అవకాశం ఆగలేక పోతున్నా హీరోయిన్..?

Divya
ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఈ నెలలోనే మొదలు పెట్టబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. ఇక ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ని కూడా ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఏ ఒక్క విషయంపై అధికారికంగా క్లారిటీ ఇంకా రాలేదు.

ఇక ఇలాంటి సమయంలోనే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒక హీరోయిన్ మాళవిక మోహన్ అంటూ కూడా వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. ఈమె ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ ఆమె స్నేహితుల వద్ద నుంచి ప్రభాస్ తో సినిమా నటించబోతున్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం. ఇక ప్రభాస్ తో సినిమా  షూటింగ్ జాయిన్ అయ్యేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అంటూ తన స్నేహితులతో చెబుతూ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తో షూటింగ్ కోసం తను ఆగలేక పోతున్నాననే వ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో మంచి సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు ఆమె అభిమానులు. కోలీవుడ్లో ఎంతమంది స్టార్స్ కి జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రభాస్ కు జోడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక మాళవిక మోహన్ ఈ సినిమాలో నటించబోతున్న విషయంపై త్వరలోనే అధికారులు ప్రకటన వెల్లువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. డైరెక్టర్ మారుతి కూడా ఒక మంచి కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్  ద్విపాత్రాభినయం కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: