గాడ్ ఫాదర్ విషయంలో వ్యూహాలు మారుతున్నాయా !

Seetha Sailaja

‘ఆచార్య’ ఫ్లాప్ తరువాత మెగా అభిమానులు దసరా రేసుకు రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి కూడ ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తో రగిలిపోతూ ‘గాడ్ ఫాదర్’ తో తిరిగి తన సత్తాను చాటాలని ఉబలాట పడుతున్నాడు. అయితే ఈ మూవీ విడుదలకు కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులలో ఈమూవీ ప్రమోషన్ విషయంలో ఇంకా ఎందుకు వేగం పెంచడంలేదు అంటూ మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

వాస్తవానికి చిరంజీవి సినిమాలలో హీరోయిన్ పాటలు లేకుంటే అతడి అభిమానులకు నచ్చదు. దీనితో ఈలోటును తీర్చడానికి ఈమూవీలో సల్మాన్ ఖాన్ తో క్లైమాక్స్ ముందు ఒక పాటను క్రియేట్ చేసి ఆ పాటకు చిరంజీవి సల్మాన్ ఖాన్ చేత అదిరిపోయే స్టెప్స్ వేయించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పాటకు డాన్స్ డైరెక్టర్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా డిజైన్ చేయడంతో ఈపాట పై చిరంజీవి అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడి ఈపాట ప్రోమో ను విడుదల చేయమని ఈమూవీ నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే ఈమూవీ నిర్మాతలు అదేవిధంగా దర్శకుడు మోహన్ రాజా ఈపాటను విడుదలకు కొద్దిరోజులు ముందు మాత్రమే విడుదల చేసి ఈమూవీ పై అనవసరపు భారీ అంచనాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాల పై మరీ విపరీతంగా అంచనాలు పెరిగిపోతే అశలుకు మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.

దీనితో ఈమూవీ పై మరీ అంచనాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే మళయాళంలో విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్న ఈమూవీని ఓటీటీ లో జనం విపరీతంగా చూసాలు. ఇప్పుడు ఆసినిమాకు రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ వస్తూ ఉండటంతో తిరిగి జరాక్స్ కాపీలా ఈ మూవీని తీసారా లేదంటే ఎలాంటి మార్పులు ఈ మూవీలో చేసారు అన్నవిషయమై చిరంజీవి అభిమానులలో విపరీతమైన సస్పెన్స్ కొనసాగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: