బట్టల బరువు మోయలేనంటున్న జాన్వీ కపూర్...!!

murali krishna
సినిమా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో అగ్ర హీరోలు అందరు సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు


ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి నటి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధడక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస అవకాశాలను అందుకుంటు బిజీ బిజీగా ఉన్నారు.


ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ కపూర్ సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను అయితే షేక్ చేస్తుంది. నిత్యం పొట్టి దుస్తులను ధరిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు కాస్త బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇకపోతే గత రెండు రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న


ఈమె ఎంతో సంప్రదాయబద్ధంగా లంగా వోణీలో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించి సందడి చేశారు.ఈ విధంగా సాంప్రదాయ దుస్తులలో చూసిన ఈమె అందంపై ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపించారు. ఇలా సాంప్రదాయ దుస్తులలో తలుక్కుమన్న జాన్వీ తాజాగా మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈమె వైట్ స్లీవ్ లెస్ టాప్, షార్ట్ జీన్స్ ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.


ఇలా పొట్టి దుస్తులను ధరించి ఫోటో షూట్ చేసుకున్న ఈమె తను బట్టల బరువు మోయలేని అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఏది ఏమైనా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ఈమె సౌత్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: