సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ఏమైంది!!

P.Nishanth Kumar
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఆయన నటించిన సినిమా రిపబ్లిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులు అయిపోతున్నా కూడా ఇప్పటిదాకా ఆయన మరొక సినిమాను మొదలు పెట్టకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. కార్తీక్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమాను చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రేపో మాపో షూటింగ్ కూడా మొదలు కాబోతుంది అని అందరూ చెప్పారు.

కానీ ఇప్పటిదాకా ఆ సినిమా మొదలు పెట్టకపోవడం వెనక కారణం ఏమై ఉంటుందో అన్న అనుమానాలను ప్రతి ఒక్కరు కూడా కలిగిస్తున్నారు. ఈ చిత్రం మాత్రమే కాకుండా మరొక సినిమాలో కూడా సాయిధరమ్ తేజ్ నటించిన బోతున్నాడని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండగా ఈ చి త్రం తప్పకుండా సాయి ధరం తేజ్ కు మంచి సినిమాగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా భావించారు కానీ ఆ సినిమాను మొదలు పెట్టకపోవడం పట్ల అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

బైక్ యాక్సిడెంట్ కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకొని తాను సినిమాలు చేసే విధంగా ముందడుగులు వేస్తున్నారు. అంతేకాదు ఇటీవలే ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో కంటనీరు పెట్టుకున్న సాయి ధరంతేజ్ ను చూసి చాలామంది ఎంతో బాధపడ్డారు ఆయన తప్పకుండా మంచి కం బ్యాక్ చేయాలని కోరుకుంటున్నారు మరి ఇప్పుడు రాబోయే ఈ రెండు సినిమాలతో అయినా ఆయన మంచి కంపేర్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటా రా అనేది చూడాలి. చిరంజీవి మేనల్లుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి తేజ్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకు లను ఎంతో ఆకట్టుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: