23 రోజుల్లో 'కార్తికేయ 2' మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహించగా , అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. వైవా హర్షా , శ్రీనివాస్ రెడ్డి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.  

కార్తికేయ 2 మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తేరగకెక్కింది. కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.  ఈ మూవీ ఇప్పటి వరకు 23 రోజుల బైక్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 23 రోజుల్లో కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 12.78 కోట్లు . సీడెడ్ : 4.81 కోట్లు . యూ ఏ : 4.36 కోట్లు . ఈస్ట్ : 2.54 కోట్లు . వెస్ట్ : 1.62 కోట్లు . గుంటూర్ : 2.68 కోట్లు . కృష్ణ : 2.20 కోట్లు . నెల్లూర్ : 1.08 కోట్లు . 23 రోజుల్లో కార్తికేయ 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో  32.07 కోట్ల షేర్ , 53.62 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.82 కోట్లు .
ఓవర్ సీస్ లో : 6.28 కోట్లు .
నార్త్ ఇండియా లో : 13.75 కోట్లు .
23 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 54.92 కోట్ల షేర్ , 110.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: