చలాకి చంటిని జబర్దస్త్ నుంచి వెళ్లగొట్టడానికి ఇంత కుట్ర జరిగిందా..?

Anilkumar
తాజాగా కమెడియన్ చలాకీ చంటి పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 6'  కంటెస్టెంట్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఈ షోకు ఎంట్రీ ఇవ్వడానికి ముందుకు కంటెస్టెంట్లు హౌజ్ లోకి ఎందుకు వెళ్లారో వారివారి కథను వినిపించారు.ఇక అప్పటికే సెలబ్రెటీ అయినా.. కమెడియన్ చంటి కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేముందు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను తెలిపారు. ఇకపోతే జబర్దస్త్ కు రావడానికి ముందే పలు చిత్రాల్లో నటించిన చంటి.. ఈషోతోనే ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తనను వెళ్లగొట్టడానికి 'జబర్దస్త్'లో జరిగిన కుట్రలను వెల్లడించారు.

ఇకపోతే చంటి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానన్నారు.కాగా  నాగార్జున నోట తన 'చంటి'అనే పేరు వినాలని ఆశించానన్నారు. అయితే తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ తనకు సపోర్ట్ చేయాలని కోరారు. 'బిగ్ బాస్ తెలుగు 6'కు వచ్చేముందు 'మల్లెమాల'లో జరిగిన విషయాలను రివీల్ చేశారు.ఇదిలావుంటే ఇక మల్లెమాల షోలో తనకు అవమానం జరిగిందని తెలిపారు. అయితే వాళ్లు ఇచ్చే డబ్బులు సరిపోలేదని.. వాళ్లని రిక్వెస్ట్ చేస్తే దారుణంగా బదులిచ్చారన్నారు.అంతేకాదు  'నీ టాలెంట్ ఇదే ఎక్కువ' అంటూ అనడం తనను బాధించిందన్నారు.

ఇదిలావుంటే  మరోవైపు తను ముక్కుసూటి మనిషినని, తప్పు జరిగితే వెంటనే ప్రశ్నిస్తానని అన్నారు. ఇక అలా ఎప్పటికప్పుడు ప్రశ్నించడం మూలంగా తనను 'కోపిష్టి, పొగరు, అటిట్యూడ్, ఈగో' అంటూ తనను ముద్రవేశారని తెలిపారు.అయితే ఇలాంటివన్నీ తనను 'జబర్దస్త్' నుంచి వెల్లగొట్టడానికి కారణం అయ్యాయని తెలిపారు. ఇక నాగబాబు గురించి కూడా మాట్లాడుతూ.. ఆయన జబర్దస్త్ లో పనిచేసే వారందరికీ దగ్గరగానే ఉన్నారని తెలిపారు. కాగా ఆయన ఆఫీసులోకి అందరూ వెళ్లేవారని చెప్పారు.ఇక  అలాంటి వ్యక్తి ఎదో చేశారనేదానిపై పరోక్షంగా కాదనే సమాధానం ఇచ్చారు.ఇకపోతే చలాకీ చంటి హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎలా ఎంటర్ టైన్ చేయనున్నారనేది చూడాలి మరి...!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: