ఈరోజు నుంచి అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అల్లరి నరేష్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు . ప్రారంభం లో ఎక్కువగా కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్ తన కెరీర్ లో గమ్యం , మహర్షి ,  నాంది వంటి సినిమాలలో తన పవర్ఫుల్ నటనతో ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్నాడు . ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల పాటు సరైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోయినా అల్లరి నరేష్ పోయిన సంవత్సరం విడుదల అయిన నాంది మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లరి నరేష్ , విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఉగ్రం అనే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ షూటింగ్ ని ఈ రోజు నుండి మొదలు పెట్టనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అల్లరి నరేష్ , విజయ్ కనకమెడల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: