క్లాస్ లుక్ లో అదరగొట్టిన పూర్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న గ్లామరస్ నటిమానులలో ఒకరు అయిన పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకుంది. అలాగే పూర్ణ టీవీ షో లకు జడ్జిగా వ్యవహరిస్తూనే ,  వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తుంది.
 

ఈ ముద్దు గుమ్మ అల్లరి నరేష్ సరసన నటించిన సీమటపాకాయ్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ లో ఒక ప్రధాన పాత్రలో నటించిన పూర్ణ ఈ మూవీ ద్వారా మంచి ప్రశంసలను అందుకుంది. ఇలా సినిమాలతో , టీవీ షో లతో , వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న పూర్ణ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగా తాజాగా పూర్ణ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో క్ల డీసెంట్ మరియు క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని అంతే డీసెంట్ గా మరియు క్లాస్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: