'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ విడుదల తేదీ మార్పు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజా వారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందు కున్నాడు. ఆ తర్వాత సెబాస్టియన్ అనే మూవీ లో కిరణ్ అబ్బవరం హీరో గా నటించాడు.
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయింది. తాజాగా కొన్ని రోజుల క్రితమే ఈ యువ హీరో సమ్మతమే అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో నేను మీకు బాగా కావలసిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించగా , మణిశర్మ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సెప్టెంబర్ 9 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయడం లేదు అని , సెప్టెంబర్ 16 వ తేదీన ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయబోతున్నాము అని తెలియ జేస్తూ మూవీ యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: