అప్పుడు కార్తికేయ ఇప్పుడు సీతారామం!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు హిందీ బెల్టులో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. బాహుబలి సినిమా తర్వాత ఎన్నో తెలుగు సినిమా లు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. తాజాగా నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ టు సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు నార్త్ లో కూడా మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్పడానికి ఆ చిత్రానికి అక్కడ వస్తున్న కలెక్షన్లే నిదర్శనం.

50 కోట్ల మార్కును అందుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఎక్కువ శాతం కలెక్షన్లు వచ్చింది హిందీలోనే అని చెప్పాలి. చాలా రోజుల తరువాత నిఖిల్ కు ఇంతటి భా రీ విజయం రావడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది ఈ క్రమంలో మరొక తెలుగు సినిమా ఇప్పుడు హిందీలో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించి మంచి కలెక్షన్లను అందుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని సినిమా బృందం భావించి వెంట వెంటనే దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టి పూర్తి చేసి ఇప్పుడు ఆ చిత్రాన్ని అక్కడ విడుదల చేయగలిగింది అక్కడ ఈ సినిమా కి మంచి స్పందన రావడం నిజంగా ఈ చిత్రాని కి కూడా మంచి కలెక్షన్లు వస్తాయ ని చెప్పడానికి నిదర్శనం ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ పొందిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా మృణాళ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది రష్మిక మంద న కూడా ఈ సినిమా లో ఒక కీలక పాత్రలో నటించింది మరి ఈ సినిమాకు హిందీ బెల్ట్ లో ఎంతటి స్థాయిలో కలెక్షన్లు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: