రజనీకాంత్ 'జైలర్' మూవీలో ఆ యంగ్ హీరో..?

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఎన్నో హిట్ ,  సూపర్ హిట్ ,  బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికి కూడా తమిళ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ తమిళ్ క్రేజీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న 'జైలర్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం రజనీ కాంత్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా ఆ ఫస్ట్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలల్లో కనిపించనుండగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  అసలు విషయం లోకి వెళితే ...  కొన్ని రోజుల క్రితం జైలర్ మూవీ లో కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా జేర్నీ మరియు రాజా రాణి మూవీ లలో హీరో గా నటించినటు వంటి తమిళ యువ హీరో జై ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: