పవన్ కళ్యాణ్ కి ఇంత వరస్ట్ ఫ్యాన్స్ ఉన్నారేంటి?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో జల్సా సినిమా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఇక జల్సా మూవీ రీరిలీజ్ కావడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కర్నూలు జిల్లాలోని ప్రముఖ థియేటర్లలో ఒకరైన శ్రీరామ థియేటర్ పై పవన్ ఫ్యాన్స్ రాళ్ల దాడి చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ థియేటర్ లో జల్సా రెండు షోలు ప్రదర్శించడం జరిగింది.అయితే థియేటర్ లో సౌండ్ సిస్టం అనేది సరిగా లేకపోవడంతో జల్సా మూవీని చూడాలని థియేటర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వచ్చింది. ఆ తర్వాత సౌండ్ సిస్టం బాగాలేదని పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగడంతో పాటు థియేటర్ పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో థియేటర్  అద్దాలు ధ్వంసమయ్యాయని సమాచారం అందుతోంది. థియేటర్ యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన, రాళ్ల దాడి చేసిన వాళ్ల బైక్స్ ను స్టేషన్ ను తరలించారని సమాచారం.ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగులపై దర్యాప్తు చేస్తున్నారు.


అయితే రీరిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల కలెక్షన్లను చారిటీ కోసం ఖర్చు చేస్తున్నారు. థియేటర్లపై పవన్ అభిమానులు దాడి చేయడం వల్ల నష్టాన్ని కలెక్షన్ల నుంచి చెల్లించాల్సి వస్తోందని తెలుస్తోంది. థియేటర్ల ఆస్తులకు నష్టం కలిగించడం వల్ల భవిష్యత్తులో పెద్ద హీరోల సినిమాల రీరిలీజ్ కు థియేటర్ల యజమానులు అంగీకరించని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.మరోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి అప్ డేట్స్ వస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. పవన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో పవన్ ఖాతాలో తొలి పాన్ ఇండియా హిట్ చేరనుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: