అల్లు అర్జున్ చేసిన గోనగన్నారెడ్డి పాత్రను.. ఆ ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారట?

praveen
దర్శకుడు గుణశేఖర్ అంటేనే విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న  విషయం తెలిసిందే. అందరూ దర్శకులలా కాకుండా కాస్త కొత్తగా సినిమాలను తెరకెక్కిస్తూ  ఉంటారూ ఆయన.  ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. ఇలాంటి వాటిలో అనుష్క ప్రధాన పాత్రలో హిస్టారికల్ మూవీ గా తెరకెక్కిన రుద్రమదేవి సినిమా కూడా ఒకటి.  ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రుద్రమదేవి సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇక ఈ సినిమాలో రుద్రమదేవి  జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి అనే విషయాలను చూపించారు.

 ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగులో మంచి విజయం సాధించడంతో ఇతర భాషలలో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో దగ్గుబాటి రానా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రానా అనుష్క స్నేహితుని పాత్రలో నటిస్తే అటు అల్లు అర్జున్ మాత్రం దోపిడీ దొంగ గోనగన్నారెడ్డి పాత్రలో నటించాడు. అయితే మొదటిసారి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించాడు అల్లు అర్జున్.
 అయితే  అల్లు అర్జున్ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర కోసం ముందుగా వేరే హీరోలను అనుకున్నారట. కానీ వారు రిజెక్ట్ చేయడంతో చివరికి అల్లు అర్జున్ కు ఈ అవకాశం దక్కింది. గోన గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్ బాబును గుణశేఖర్ అనుకున్నారట. ఇక ఈ పాత్ర కోసం మహేష్ ని సంప్రదిస్తే తనకు ఈ పాత్ర సెట్ కాదని తేల్చి చెప్పారు. తర్వాత ఎన్టీఆర్ను ఈ పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఇక సినిమాకు నో  చెప్పారట చివరికి ఇద్దరు స్టార్ హీరోలు నో  చెప్పడం తో ఈ పాత్ర అల్లు అర్జున్ వరకు వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: