నువ్వు హిందువుల వ్యతిరేకివి.. అన్న నెటిజన్ షాకింగ్ రిప్లై ఇచ్చిన రష్మీ..!!

Divya
తన అంద చందాలకు ఎంతో చలాకీగా ఉండే రేష్మి ప్రస్తుతం యాంకరింగ్ గా తనదైన స్టైల్ లో కొనసాగిస్తూ స్టార్ పొజిషన్ లో ఉన్నది. అయితే గతంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన అవి పెద్దగా కలిసి రాకపోవడంతో ఇక ఈమె సినిమాలలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుచేతనే ఎక్కువగా బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ ఉన్నది. ఇక రష్మిక అందం తన అమాయకత్వం తన మాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటుంది రష్మీ. సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ప్రతిరోజు కొన్ని ఫోటో షూట్లతో పాటు ఏదైనా జంతువులకు సంబంధించిన వాటిని షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక నేటిజన్ కు ఒక దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఒక భారీ వినాయక విగ్రహాన్ని ఒక ఏనుగుతో పూలమాల వేయించారు కొందరు.. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో చాలా పాపులర్ గా మారుతోంది. ఆ వీడియో పై స్పందించిన రష్మి .. అలా వినాయక విగ్రహం మెడలో పూలమాల వేసే సమయంలో ఆ ఏనుగు ఎంతగా ఇబ్బంది పడిందో అంటూ ఆమె ఆవేదనను తెలియజేసింది.

ఇలా మన సంతోషం కోసం జంతువులను ఉపయోగించుకోవడం చాలా తప్పని ట్వీట్ చేయడం జరిగింది రష్మీ. రష్మీ ట్వీట్ పై కొంతమంది పలు రకాలుగా స్పందించారు. ఒక నెటిజన్ మాత్రం మీరు జంతు ప్రేమికులేమీ కాదని మాకు తెలుసు మీరు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేశారు. దీంతో రష్మీ స్పందిస్తూ.. నేను నంది, గోమాతలను కూడా గౌరవిస్తానని అందుచేతానే నేను లెదర్ తో చేసిన వస్తువులను వాడను అంతేకాకుండా పాల పదార్థాలను అసలు తీసుకొని ఎందుచేత అంటే పాల కోసం ఆవు తన జీవితకాలంలో ఎన్నోసార్లు గర్భం దాలుస్తుందని తెలియజేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: