హరిహర వీరమల్లు: ఫెరోషియస్ గా పిచ్చెక్కిస్తున్న పవర్ స్టార్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తొలి పీరియాడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ `హరి హర వీరమల్లు`. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని జాగర్లమూడి క్రిష్ డైరెక్టర్ చేస్తున్నారు.ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం సమర్పణలో ఏ . దయాకర్ రావు ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఎప్పెడెప్పుడు ఈ మూవీ నుంచి అప్ డేట్ వస్తుందా? అని చాలా రోజులుగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు సెప్టెంబర్ 2న శుక్రవారం నాడు భారీ స్థాయిలొ జరుగుతున్న నేపథ్యంలో గురువారం చిత్ర బృందం ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది.సెప్టెంబర్ 2న పుట్టిన రోజు సర్ ప్రైజ్ గా సాయంత్రం 5:45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో మరో సర్ ప్రైజ్ ని కూడా విడుదల చేయబోతోంది. గురువారం నాడు విడుదల చేసిన ప్రచార చిత్రం చాలా విశేషంగా ఆకట్టుకుంటోంది.

 బ్లూ కలర్ డ్రెస్ లో మెడలో నడుము భాగంలో రెడ్ కలర్ రుమాల్ ధరించి సమరానికి సై అంటూ ఫెరోషియస్ లుక్ లో రథంపై ముందుకు దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. 17వ శతాబ్ద కాలంలోని మొఘలుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బందిపోటు దొంగ `హరి హర వీరమల్లు`గా కనిపించబోతున్నాడు. కోహిరూర్ వజ్రంని కొట్టేసే దొంగగా పవన్ కళ్యాణ్ మరింత పవర్ ఫుల్ పాత్రలో కనిపిచనున్నారట. ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తూ `స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం` అంటూ ఈ ఫొటోకు ట్యాగ్ టైన్ ని జత చేశారు.


17వ శతాబ్దం నాటి మొఘలాయిలు కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే కథతో అత్యద్భుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.ఇండియన్ స్క్రీన్ పై ఇంత వరకు ఎవరూ టచ్ చేయని ఓ బందిపోటు కథతో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకుల్ని అలరించే అంశాలన్నీ ఇందులో వుంటాయని అసలు ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ మూవీని నిర్మిస్తున్నాయని ఈ మూవీ మేకర్స్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: