బ్రహ్మాస్త్ర కు సపోర్ట్ గా బింబిసార !

Seetha Sailaja
భారీ సినిమాల పరాజయాలతో అతలాకుతలమైపోతున్న బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని రక్షించగల హీరో ఎవరు అంటూ ఇప్పుడు బాలీవుడ్ అత్యంత ఆశక్తితో ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్థితులలో సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ వైపు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాల ఆశగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ కు ఒక భారీ హిట్ కావాలి.

ఆలోటును ‘బ్రహ్మాస్త్ర’ తీరుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న యాన్ ముఖర్జీ పై ఉంది. ఈసినిమా సూపర్ హిట్ అయితే బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి రాజమౌళి లా అద్భుతాలు చేయగల ఒక దర్శకుడు దొరికినట్లే అని భావిస్తున్నారు. ఈమూవీని దక్షిణాది భాషలు అయిన తెలుగు తమిళం కన్నడం మళయాళంలో కూడ డబ్ చేసి విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ కలక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశపడుతోంది.

దీనికి తగ్గట్టుగా ఈమూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను రాజమౌళి తీసుకోవడంతో ఈమూవీ ప్రమోషన్ కోసం స్వయంగా రంగంలోకి దిగిన రాజమౌళి ఈమూవీని ఆకాశంలోకి ఎత్తేస్తున్నాడు. అంతేకాదు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ అలియాభట్ లతో కలిసి రాజమౌళి తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యనగరాలలో ఈసినిమాను ఇప్పటికే ప్రమోట్ చేసారు. ప్రమోట్ చేస్తూ ఈమూవీ పై భారీ అంచనాలు పెంచుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈమూవీ ప్రమోషన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను కూడ రాజమౌళి రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో జరగబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ అతిధిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ రావడమే కాకుండా ఆమూవీ గ్యారెంటీ హిట్ అంటూ ముందుగానే జోశ్యం చెప్పి కళ్యాణ్ రామ్ కు జోష్ ను ఇచ్చాడు. ఇప్పుడు రాజమౌళి స్వయంగా సమర్పిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వెర్షన్ ఘనవిజయం జక్కన్నకు ఆర్థికంగా కూడ బాగా కలిసి వస్తుంది కాబట్టి స్వయంగా తారక్ ఈమూవీ ప్రమోషన్ కోసం రంగంలోకి దిగుతున్నాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: