రెండు భారీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న సునీల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరీర్ ప్రారంభం ఎన్నో సినిమాల్లో కమెడియన్ పాత్ర లలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సునీల్ 'అందాల రాముడు' మూవీ తో మొట్ట మొదటి సారి కెరియర్ లో హీరో గా నటించాడు . ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన మర్యాద రామన్న మూవీ తో రెండవ సారి కెరియర్ లో సునీల్ హీరో గా నటించాడు . 

ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అప్పటి నుండి సునీల్ ఎన్నో సంవత్సరాల పాటు హీరో గానే కెరియర్ ని కొనసాగించాడు . ఆ తర్వాత మళ్లీ సునీల్ సినిమాల్లో హీరో పాత్రలలో మాత్రమే కాకుండా కమెడియన్ పాత్రలు మరియు ఇతర పాత్రలో కూడా నటిస్తూ వస్తున్నాడు. అలాగే ప్రస్తుతం సునీల్ విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. సునీల్ అందులో భాగంగా  కలర్ ఫోటో ,  పుష్ప మూవీ లలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొన్ని రోజుల్లో షూటింగ్ ప్రారంభం కాబోయే రెండు భారీ తెలుగు సినిమాల్లో సునీల్ అవకాశాలను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ...  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో సునీల్ కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుం.ది ఇలా ఒకే సమయంలో రెండు అదిరి పోయే క్రేజ్ ఉన్న సినిమాలలో సునీల్ చాన్స్ కొట్టేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: