5 నిమిషాల సుఖం కోసం.. కోట్లు పెట్టరు కదా.. క్యాస్టింగ్ కౌచ్ పై ప్రగతి?

praveen
గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో చర్చ జరుగుతూనే ఉంది. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ముందుగా దర్శకనిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. వారి కోరిక తీర్చాల్సిందే అంటూ ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్న నటీమణులు షాకింగ్ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు. మరికొంతమంది తమ కెరియర్లో ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుమన విషయం తెలిసిందే.  అయితే మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ దర్శకులు అడిగింది ఇవ్వాలా వద్దా అన్నది వారి సొంత నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని.. కానీ అందరూ అలాగే ఉంటారు అని అనుకోవద్దు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఇక ఇటీవల ఇదే విషయంపై మనందరికీ తెలిసిన టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేసింది. సక్సెస్ అయిన హీరోయిన్స్ ఎవరైనా సరే తమకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం లేదని చెబుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రగతి. సక్సెస్ హీరోయిన్లు ఇండస్ట్రీలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు పెద్దగా పట్టించుకోరూ.  ఫెయిల్యూర్ హీరోయిన్లు మాత్రమే ఇలాంటి తరహా ఫిర్యాదులు చేస్తారంటూ తెలిపింది.  అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు జరగలేదని నేను చెప్పను.

 అయితే సదరు హీరోయిన్లు సందర్శించిన దర్శకుడు నిర్మాతలు గొప్పవారు కాకపోయి ఉండవచ్చు అంటూ ప్రగతి అభిప్రాయం వ్యక్తం చేసింది. సినిమా రంగంలోనే కాదు ప్రతి రంగంలో అలాంటి వ్యక్తులు ఉంటారని చెప్పుకొచ్చింది. అయితే నిర్మాతలు హీరోయిన్లపై కోట్ల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్ చేసేది కేవలం ఐదు రూపాయల సుఖం కోసం మాత్రమే కాదు అంటూ ప్రగతి చెప్పుకొచ్చింది. హీరోయిన్ పైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ కి  ఒప్పుకుంటేనే అవకాశం ఇస్తారు అంటే ఎలా కుదురుతుంది. అమ్మాయి సినిమాలోని పాత్రకు సూట్ అయితేనే కదా సెలెక్ట్ చేసేది అంటూ ప్రగతి చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ కెరీర్ ను ప్రభావితం చేస్తుందని తాను నమ్మను అంటూ కామెంట్ చేసింది. నా కెరీర్లో ఇప్పటివరకు నెగెటివిటీ కనిపించలేదు అంటూ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: