ప్లాప్ లతో సంబంధం లేకుండా నితిన్ వరుస సినిమాలు !
ఆ తరవాత భీష్మ సినిమా హిట్ అందుకుని మళ్ళీ నితిన్ కు ఊపిరి ఇచ్చింది. దాంతో మళ్ళీ హీరో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కేసాడు ఇక తగ్గేదే లే అని అంతా అనుకుంటుండగా మళ్ళీ చక్ దే, మాస్ట్రో చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ఆయన ఫాలోయింగ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఇంతకు ముందు వచ్చిన చెక్, రంగ్ దే, మాస్ట్రో కూడా వరుసగా నిరాశపరచగా..ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మాచర్ల నియోజక వర్గం సినిమా కూడా అదే బాట పట్టి నిరాశపరిచింది. ఇలా వరుస ఫ్లాప్ లు పడ్డాయి, కానీ అవేవీ నితిన్ కెరియర్ కి కాస్త కూడా అడ్డు కాలేదనే చెప్పాలి.
ఈ హీరో ప్రస్తుతం వరుస పెట్టి చిత్రాలను లైన్ లో పెట్టేసిన సంగతి తెలిసిందే. దాదాపు అరడజను సినిమాలను సెట్స్ పైకి తీసుకువస్తున్నాడు అని తెలుస్తోంది. అంతేకాదు కొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఒక సినిమాకు ఓకే చెప్పిన సంగతి విషయం తెలిసిందే. అలాగే, భీష్మ మూవీ దర్శకుడు వెంకీ కుడుమల తో మరో సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా భీమ్లా నాయక్ దర్శకుడితో కూడా ఓ మూవీ చేస్తున్నట్లు వినికిడి. అలాగే మరి రెండు, మూడు స్టోరీ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వరుస చిత్రాలతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ హీరో ఒక్క బ్లాక్ బస్టర్ కనుక పడిందంటే ఇక రేస్ మామూలుగా ఉండదు మరి.