బింబి సారా పై అది ఫేక్ న్యూస్ అంట!!

P.Nishanth Kumar
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సార చిత్రం ఇటీవలే విడుదలై భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. చాలా రోజుల తర్వాత ఒక మైథలాజికల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారందరినీ కూడా ఎంతగానో అబ్బురపరిచింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై అందరిలో ఎన్నో అంచనాలు మొదలయ్యాయి. మొదటినుంచి ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఉంటుంది అని చిత్ర బృందం కూడా చెబుతూ ఉండటంతో ఈ సినిమా యొక్క సీక్వెల్ కోసం ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూశారు.

అయితే ఈ సీక్వెల్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ సీక్వెల్ సినిమాలో ఒక లేడీ విలన్ ఉంటుందని ఆమెను ఏ విధంగా హీరో ఎదుర్కొన్నాడు అన్నది ఈ సినిమా యొక్క అసలు కథ అని వారు చెప్పారు. అయితే తాజాగా చిత్ర బృందం నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో ఎలాంటి లేడీ విలన్ లేదు అని ఈ సినిమా యొక్క సీక్వల్ ఉంటుంది కానీ అది ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుందా అన్న విషయం ఇంకా స్పష్టంగా చెప్పలేం అని వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇదంతా ఫేక్ న్యూస్ అనే మనం అనుకోవచ్చు. జెన్యూన్ గా ఈ సినిమా సాధించిన విజయం అంతా కాదు. ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమలో మరిన్ని రావాలి. ఈ నేపథ్యంలోనే ఈ సీక్వెల్ త్వరగా తెరకెక్కితే బాగుంటుంది అనేది కొంతమంది సినిమా విశ్లేషకులు అభిప్రాయం. మంచి ఎంగేజింగ్ కథ పడితే కానీ ఇలాంటి మంచి హిట్ సినిమాను తెరకక్కించడం కష్టం. ఈ నేపధ్యంలో దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు ఎలాంటి కథనం రాస్తారో చూడాలి. మరి కొంత మంది ఈ సినిమాకు సీక్వెల్ చేయకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. కొన్ని క్లాసిక్ సినిమాలను హిట్ సినిమాలను ముట్టుకోకుండా ఉంటేనే మంచిదని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: