జల్సా రీరిలీజ్: బుకింగ్స్ మాములుగా లేవుగా.. రచ్చే?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మన అందరికి తెలుసు.ముఖ్యంగా అందులోని పాటలు ‘సరిగమ పదనిస’, ‘గాల్లో తేలినట్టుందే’, 'జెన్నిఫర్ లోపేజ్' 'మై హార్ట్ ఈజ్ బీటింగ్', 'ఛలోరే చల్' 'యూ అండ్ ఐ' అంటూ సాగే పాటలు అప్పటి కుర్రకారులని అయితే ఎంతగానో ఉర్రూతలు ఊగించాయి. ఇంక మాటల మాంత్రికుడు మాటలు, సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అయితే సినిమాకి మరింత అందాన్ని తెచ్చాయి.సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ అభిమానుల కోరిక మేరకు ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పెషల్ షోస్ గాను మూవీ టీం ఆన్లైన్ లో టికెట్లని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన కొద్దిసేపటికే టిక్కెట్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇక పవన్ అభిమానులు అయితే అదీ పవన్ స్టార్ రేంజ్ అంటూ వారి అభిమాన నటుడు గురించి చెప్పుకుంటున్నారు.అయితే ఈ స్పెషల్ షోస్ తో పాటు తమ్ముడు మూవీని కూడా కొన్ని చోట్ల ప్రదర్శించబోతున్నారు. తమ అభిమాన నటుడిని వెండితెరపై చూసుకుని ఏడాది కావడంతో ఈ స్పెషల్ షోస్ తో అభిమానాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ స్పెషల్ షోస్ తో వచ్చిన కలెక్షన్ లని ఛారిటీకి ఇస్తున్నట్టుగా అభిమాన సంఘాలు వెల్లడించాయి. పవన్ అభిమానులు అంటే పవన్ ని అభిమానించడమే కాదు పవన్ సిద్ధాంతాలని కూడా అనుసరించడం అంటూ తమ అభిమాన నటుడిపై ఉన్న అమితమైన అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల మహేష్ పోకిరి రీ రిలీజ్ అయి భారీగా కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు జల్సా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: