కాస్టింగ్ కౌచ్ పై ప్రగతి షాకింగ్ కామెంట్స్.. 5 నిమిషాల సుఖం కోసం హీరోయిన్లను అలా అంటూ..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీగా మారిపోయారు. ఈమె 90 వ దశకం నుంచి నటిగా రాణిస్తున్నారు. ఇక అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది.అయితే  ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈమె తల్లి, అత్త తరహా పాత్రలకు దర్శకులు ప్రగతినే సంప్రదిస్తున్నారు.ఇకపోతే చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. కాగా మీటూ ఉద్యమం మొదలైన తర్వాత నటీమణులు తమకి ఎదురైన వేధింపులని బయట పెట్టడం ప్రారంభించారు.  అయితే కాస్టింగ్ కౌచ్ పేరుతో చిత్ర పరిశ్రమ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని ప్రగతి అన్నారు. అంతేకాదు  కాస్టింగ్ కౌచ్ పై తన వెర్షన్ ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినిపించారు.ఆమె మాట్లాడుతూ..సక్సెస్ సాధించి ఓ స్థాయికి ఎదిగిన హీరోయిన్లని ఎవరినైనా అడగండి..

ఇక  కాస్టింగ్ కౌచ్ అనుభవం తమకి లేదనే చెబుతారు. ఇండస్ట్రీలో చిన్న చిన్న సంఘటనలు జరిగినా..  విజయం సాధించిన హీరోయిన్లు వాటిని పట్టించుకోరు. కాస్టింగ్ కౌచ్ కంప్లైంట్స్ ఎక్కువగా సక్సెస్ సాధించలేకపోయిన హీరోయిన్ల నుంచే వస్తుంటాయి.ఇక  కాస్టింగ్ కౌచ్ సంఘటనలు కొన్ని జరిగి ఉండొచ్చు. కొట్టి పారేయలేం.  వాళ్ళని సంప్రదించిన దర్శకులు, నిర్మాతలు అంత గొప్ప వారు కాదేమో.అంతేకాదు  అలాంటి వాళ్ళు ప్రతి రంగంలో ఉంటారు.కాగా ఒక అమ్మాయి కోసం సినిమా తీయరు.కాగా  హీరోయిన్లపై కోట్లల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసేది, వాళ్ళకి పారితోషికం ఇచ్చేది 5 నిమిషాల సుఖం కోసం కాదు.ఇక  పలానా అమ్మాయి అందుకు ఒప్పుకుంటే ఛాన్స్ ఇస్తా అంటే కుదరదు. ఇకపోతే ఆ అమ్మాయికి ఆ పాత్ర సూట్ అయితేనే ఎంపిక చేస్తారూ. సినిమా రిజల్ట్ హీరోయిన్ పై ఆధారపడి ఉంటుంది.

ఇక  కాస్టింగ్ కౌచ్ హీరోయిన్ల కెరీర్ ని ప్రభావితం చేస్తుంది అంటే తాను నమ్మను అని ప్రగతి అన్నారు.అంతేకాదు  ప్రతిభ, పొటెన్షియల్ ఉంటే సంవత్సరం లేటు అయినా మంచి ఆఫర్స్ వస్తాయి.ఇక ప్రతిభ లేకుండా కాస్టింగ్ కౌచ్ ని కారణంగా చెప్పే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు అని ప్రగతి అన్నారు.అయితే  ఒక చిత్రంలో ఆ పాత్రకి ఏ అమ్మాయి బావుంటుందో దర్శక నిర్మాతలు వారినే తీసుకుంటారు.  ఇకపోతే నాకు ఎలాంటి నెగిటివిటి కనిపించలేదు. అంతేకాదు ఈ ఒక్క పాయింట్ పట్టుకుని చిత్ర పరిశ్రమలో జరుగుతున్న వందల కోట్ల బిజినెస్ అంత దానికోసమే అన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు.ఇక  సినిమా వేల మందికి జీవనాధారం. అయితే అలాంటి సినిమాని పట్టుకుని ఆ ఒక్క అంశమే ఇండస్ట్రీ అంటూ మాట్లాడడం కుసంస్కారం అని ప్రగతి అన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: