లైగర్ ఎఫెక్ట్.. విజయ్ కి వీరాభిమాని లేఖ..!!

Anilkumar
విజయ్ దేవరకొండకి వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక  రౌడీస్.. తమ అభిమాన హీరో పేరు చెబితే ఊగిపోతారు. ఇప్పుడు  'లైగర్' సినిమా విషయంలో రౌడీస్ ముందుగా తీవ్ర నిరాశ చెందారు.అయితే దానిక్కారణం, సినిమాలో 'విషయం' లేకపోవడం.ఇక 'లైగర్' సినిమా చూశాక ఓ వీరాభిమాని, తన అభిమాన నటుడికి ఓ ఓపెన్ లెటర్ రాశాడు. సుదీర్ఘంగా అందులో తాను ఎప్పటినుంచి విజయ్ దేవరకొండని అభిమానిస్తున్నదీ రాసుకొచ్చాడు.అయితే  సక్సెస్, ఫెయిల్యూర్ వంటివాటికి అతీంగా విజయ్ దేవరకొండపై పెంచుకున్న మమకారం గురించి కూడా సుదీర్ఘంగా రాసుకొచ్చాడు ఆ అభిమాని.

విజయ్  అభిమానులూ తమను తాము రౌడీస్.. అనే భావనలో వుంటారు. ఇక అలా ఓ వీరాభిమాని 'వయొలెంట్ బాయ్' అని పేరు పెట్టుకున్నాడు. ఇదిలావుంటే సోషల్ మీడియాలో అతనికి బోల్డంతమంది ఫాలోవర్స్ కూడా వున్నారు.ఇక 'ఓసారి సినిమాకి కమిట్ అయ్యాక నువ్వెంత కష్టపడతావో, ఆ కష్టమంతా తెరపై కనిపిస్తుంటుంది. కథల ఎంపికలో కూడా ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెడితే బావుంటుంది. అంతేకాదు  నువ్వు కథను నమ్ముతున్నావ్.. కానీ, నిన్ను నమ్మించేవాళ్ళు ఆ కథ పట్ల అంత మమకారంతో వుంటున్నట్లు కనిపించడంలేదు.. అది లైగర్ సినిమా చూశాక నాకు అర్థమయ్యింది..' అంటూ ఆ అభిమాని పేర్కొనడం గమనార్హం.

అయితే నీకు చెప్పేంతటోడ్ని కాకపోవచ్చు నేను. కానీ, నీ కష్టం వృధా అవుతున్నందుకు బాధగా వుంది..' అని పేర్కొన్న సదరు అభిమాని, 'పెళ్ళి చూపులు', 'గీత గోవిందం' వంటి సినిమాలు నీకు అన్ని సెక్షన్ల ఆడియన్స్‌లోనూ అభిమానుల్ని పెంచితే, 'అర్జున్ రెడ్డి' నిన్ను చాలా ప్రత్యేకంగా నిలబెట్టాయంటూ ఆ అభిమాని ప్రస్తావించాడు.ఇకపోతే 'ఇది నా హంబుల్ రిక్వెస్ట్.. సక్సెస్, ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే మంచి సినిమా చేశానన్న భావన నీకూ వుండాలి..' అని ఆ అభిమాని చాలా బాధతో లేఖ రాయడం సంచలనంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: