పవన్ కళ్యాణ్ గొప్ప మనసు.. షాకింగ్ విషయం చెప్పిన 'తమ్ముడు: సినిమా విలన్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతో మంది హీరోలలో అటు సేవ గుణం కలిగిన వారు ఉన్నారు అని చెప్పాలి.  సినిమాలలో కోటి రూపాయలు సంపాదించి సరిపెట్టుకోవడం కాదు ఎంతో మందికి సహాయ సహకారాలు కూడా అందిస్తూ తమలో ఒక గొప్ప మనిషి దాగి ఉన్నాడు ఎప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా కోట్ల రూపాయలు విరాళం అందిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉంటారు తెలుగు హీరోలు.

 ఇలా గొప్ప మనసు కలిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వారిలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ ముందుంటారు అని చెప్పాలి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేపట్టాడు అని చెప్పాలి. పదవి లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఎంతో మందికి ఆపదలో సహాయం చేస్తూ నేనున్నానని ధైర్యం ఇస్తున్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ చేసిన ఒక గొప్ప సాయం గురించి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా లో విలన్ గా నటించిన భూపిందర్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

 తమ్ముడు సినిమా సమయంలో ముంబై నుంచి హైదరాబాద్ తాను రావాల్సి వచ్చింది. హైదరాబాద్ కు బాగానే వచ్చాను. కానీ రిటర్న్ అవ్వడానికి ఇబ్బంది ఎదురైంది. అలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ 25 వేల రూపాయలు ఇచ్చి టికెట్ కూడా ఆయనే తీసి నన్ను ముంబై పంపించారు అంటూ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ మరింత గర్వపడుతున్నారూ అని చెప్పాలి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా సహాయం చేస్తే పదవి కోసమే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. కానీ మా అభిమాన హీరోకీ ఎప్పటి నుంచొ సహాయం చేసే గుణం వుంది అంటూ ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: