దానితో కోపం వచ్చి వెనక్కి వెళ్లిపోయిన అమితాబ్..!

Pulgam Srinivas
బిగ్ బి అమితా బచ్చన్ ప్రస్తుతం ప్రాజెక్టు కే అనే మూవీ లో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇటీవల ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చిన అమితా బచ్చన్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ కి వెళ్లారట , అక్కడ గేటు వద్ద ఎంట్రీ కోసం చూపించాల్సిన ఓ టి పి ని సెక్యూరిటీ  వ్యక్తి డ్రైవర్ ని అడగగా అతను లేదు అని చెప్పడంతో లోపలికి పోనివ్వ లేదట , దానితో అమితా బచ్చన్ మొహం చూపించిన కూడా వెళ్ళ నివ్వక పోవడంతో కోపం వచ్చి అమితా బచ్చన్ వెనక్కి వెళ్లి పోయారట . ఈ విషయం తెలుసుకున్న మూవీ యూనిట్ అమితా బచ్చన్ ని కలిసి సారీ చెప్పారట .

ఇది ఇలా ఉంటే ప్రాజెక్ట్ కే మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా , బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది . ఈ మూవీ లో అమితా బచ్చన్ ఒక ముఖ్యమైన కీలక పాత్రలో నటించబోతున్నాడు . ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. మహానటి మూవీ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తేరక్కకుతున్న మూవీ కావడం , ప్రభాస్ ఈ మూవీ లో హీరోగా నటిస్తూ ఉండడం , దీపికా పదుకొనే , అమితా బచ్చన్ లాంటి నటీనటులు ఈ మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: