ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్ లలో విడుదల కానున్న 'లైగర్' మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , అనన్య పాండే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించగా , ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్ర లో మైక్ టైసన్ కనిపించ బోతున్నాడు . ఈ మూవీ ని పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్  మరియు కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు . రేపు అనగా ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు తో పాటు హిందీ , తమిళ్ , మలయాళం ,  కన్నడ భాషల్లో లైగర్ మూవీ విడుదల కాబోతుంది .

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటం తో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ దేశ వ్యాప్తంగా ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు .  ప్రపంచ వ్యాప్తంగా లైగర్ మూవీ ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుంది తెలుసు కుందాం .
నైజాం : 320 .
సీడెడ్ : 190 .
ఆంధ్ర : 420 ప్లస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లైగర్ మూవీ 930 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది .
కర్ణాటక :  100 ప్లస్
తమిళనాడు : 100 ప్లస్
కేరళ : 100 .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1000 ,
ఓవర్ సీస్ లో :  700 ప్లస్ .
ప్రపంచ వ్యాప్తంగా లైగర్ మూవీ దాదాపుగా 3000 థియేటర్ లలో విడుదల కాబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: