'ది వారియర్' దర్శకుడికి జైలు శిక్ష?

Purushottham Vinay
సినీ పరిశ్రమలో చెక్ బౌన్స్ కేసులు అనేవి చాలా సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. ఎంత పెద్ద దర్శకులు అయినా, నిర్మాతలు అయినా కూడా ఖచ్చితంగా పలు సందర్భాల్లో ఈ చిక్కుల్లో పడుతునే ఉంటారు.తాజాగా 'ది వారియర్' సినిమా దర్శకుడు లింగుసామి ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఇక అంతే కాకుండా ఈ కేసులో అతడికి 6 నెలల జైలుశిక్ష కూడా విధించింది కోర్టు. ఇక ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..తిరుపతి బ్రదర్స్ అనే పేరుతో లింగుసామి ఇంకా తన సోదరుడు సుభాష్ చంద్రబోస్‌కు ఓ సినిమా ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ.. 2014 వ సంవత్సరంలో పీవీపీ క్యాపిటల్స్ అనే ఫైనాన్స్ కంపెనీ నుండి రూ.1.3 కోట్లు అప్పుగా తీసుకుంది.ఇక 'ఎన్ని ఎరు నాళ్' అనే టైటిల్‌తో ఈ సినిమాను లింగుసామి తెరకెక్కించాల్సి ఉంది. ఇందులో కార్తి ఇంకా సమంత హీరోహీరోయిన్లుగా ఫైనల్ అయ్యారు కూడా. కానీ ఎందుకో ఈ చిత్రం తరువాత పట్టాలెక్కలేదు.దీంతో ఈ సినిమా కోసం తీసుకున్న డబ్బు కూడా తిరిగివ్వలేకపోయింది తిరుపతి బ్రదర్స్ సంస్థ.


ఇక ఈ విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది పీవీపీ క్యాపిటల్స్. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో లింగుసామి ఇంకా తన సోదరుడు ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తామని అంగీకరించారు.ఇక కొన్నాళ్ల తర్వాత ఓ చెక్‌ను పీవీపీ క్యాపిటల్స్‌కు వారు అందజేశారు. కానీ ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో లింగుసామికి ఇక కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.ఈ కేసులో లింగుసామికి ఇంకా తన సోదరుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ విషయంపై లింగుసామి తాజాగా ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశాడు. ఇందులో కోర్టుకు తాను విజ్ఞప్తి చేశానని ఇంకా ఏ సమస్య వచ్చినా లీగల్‌గానే ఎదుర్కుంటామని అందులో తెలిపాడు లింగుసామి. ఇక కొంతకాలంగా లింగుసామి అసలు ఫామ్‌లో లేడు.అలాగే తెలుగులో తాను తెరకెక్కించిన 'ది వారియర్' కూడా డిజాస్టర్‌గానే నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: