షాకింగ్: 'వారియర్' డైరెక్టర్ కి 6 నెలలు జైలు శిక్ష.. అసలేం జరిగిందంటే..?

Anilkumar
ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా ది వారియర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు లింగు స్వామి. కాగా కృతి శెట్టి హీరోయిన్ గా .. రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో..నటించిన ఈ సినిమా తెలుగు తో పాటు తమిళంలో కూడా ఒకే సారి రిలీజ్ అయ్యి...భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. అయితే ఇక ఈ ఇబ్బంది చాలదన్నట్టు లింగు స్వామికి మరో తలనొప్పి తగులుకుంది.. ఇదిలావుంటే తాజాగా ఈ డైరెక్టర్ ఒక చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలలు జైలు శిక్ష పడింది.అయితే చెక్ బౌన్స్ కేసులో డైరెక్టర్‌ ఎన్ లింగుసామి తో పాటు అతని సోదరుడు ఎన్ సుభాష్ చంద్రబోస్‌లకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.

ఇకపోతే పీవీపీ క్యాపిటల్ దగ్గర నుంచి కొన్నేళ్ల క్రితం కోటి 35 లక్షల రూపాయలను లింగుస్వామి, సుభాష్‌చంద్ర బోస్ తీసుకున్నారట. అయితే  ఇక వాటిని చెల్లించే క్రమంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వంతో సదరు సంస్థ ఇద్దరు సోదరులపై కేసు నమోదు చేసింది. కాగా దాంతో ఇద్దరు అన్నదమ్ములకు కోర్డ్ 6 నెలలు జైలు తో పాటు.. ఆ డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.అయితే ఇక ఈ విషయంలో డైరెక్టర్ లింగుస్వామి, సోదరుడితో కలిసి కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని సమాచారం.పోతే  ఈ న్యూస్ కోలీవుడ్ లో భారీ సంచలనం సృష్టిస్తుంది. కాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ డైరెక్టర్ గా లింగు స్వామికి మంచి పేరు ఉంది.

అయితే చాలామంది తమిళ టాప్ హీరోలు మాత్రమే కాదు తెలుగులో కూడా పలువురు స్టార్ హీరోలు ఈ డైరెక్టర్ తో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక లింగస్వామి తో సినిమా చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ఇచ్చారట.ఇదిలావుంటే మమ్ముట్టి నటించిన ఆనందం సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు లింగుస్వామి. పోతే ఆ తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో మంచి స్టార్ డమ్ సంపాదించారు. అయితే ఇక లింగుస్వామి ఆయన సొదరుడు సుభాష్ పేరు మీద తిరుపతి బ్రదర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది.కాగా  ఇటువంటి తరుణంలో ఆయనకు జైలు శిక్ష పడటం దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: