ఏజెంట్: సైలెన్స్.. అసలేం జరుగుతుంది?

Purushottham Vinay
ఇక తనను మాస్ లో బలంగా నిలబెడుతుందని అక్కినేని అఖిల్ ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ ఆ మధ్య టీజర్ రిలీజ్ తో హడావిడి చేశాక ఉన్నట్టుండి సైలెంట్ అయ్యింది.దానికి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చినప్పటికి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు ఇంకా గుడ్ న్యూస్ చెప్పడం లేదు. అంతా సవ్యంగా అనుకున్న టైం ప్రకారం జరిగి ఉంటే ఆగస్ట్ 12 వ తేదీన థియేటర్లలో ఏజెంట్ సినిమా రచ్చ జరిగిపోయేది.కానీ అది సాధ్యపడలేదు. సరే సినిమా క్వాలీటీ చాలా ముఖ్యమని ఫ్యాన్స్ సర్దుకున్నారు.అయితే ఇప్పుడు హఠాత్తుగా మౌనం వహిస్తే ఎలానేదే వాళ్ళ ప్రశ్న.ఇన్ సైడ్ టాక్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఏజెంట్ ని డిసెంబర్ మూడో వారానికి రెడీ చేస్తున్నారు. అయితే అలా అని అదెంతో దూరంలో లేదు. జస్ట్ మూడున్నర నెలలు టైం అంతే. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ రిలీజ్ ఇంకా అలాగే ఈవెంట్లు వగైరా చాలా తతంగాలుంటాయి. మరి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా స్పీడ్ పెంచాలి.


కొన్ని సన్నివేశాలు అయితే మరింత బెటర్ గా రావడం కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి కొంత రీ షూట్ అడిగాడని, నాగార్జున అఖిల్ తో పాటు అనిల్ సుంకర వాటి పట్ల సంతృప్తిగా ఉండటంతో డిస్కషన్లు కూడా జరుగుతున్నాయని వినికిడి.ఇదంతా కూడా వీలైనంత త్వరగా కొలిక్కి రావాలి. ఎందుకంటే ఏజెంట్ సినిమా ఏదో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాదు. పదుల కోట్ల బడ్జెట్ తో ముడిపడిన భారీ ప్యాన్ ఇండియా మూవీ. ఆర్ఆర్ఆర్ ఇంకా అలాగే కెజిఎఫ్ సినిమాల రేంజ్ లో ప్రమోషన్లు ప్లాన్ చేసుకోవాలి. మలయాళం లెజెండరి యాక్టర్ మమ్ముట్టి ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా మలయాళంలో కూడా పిచ్చ క్రేజ్ వస్తుంది. ఇక హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ని ఆడియన్స్ మైండ్ లో బలంగా రిజిస్టర్ చేయాలి. ఒకవేళ డిసెంబర్ నెల స్లాట్ కనుక మిస్ అయితే సంక్రాంతి బరిలో తన స్థాయిలో మించిన వాళ్ళతో పోటీ పడాల్సి ఉంటుంది. అంత రిస్క్ ఎందుకనుకుంటే ప్లానింగ్ మార్చుకోవడం చాలా అవసరం.మరి ఏజెంట్ టీం ఏం ఆలోచిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: