బింబిసార: బాలీవుడ్ ఎంట్రీకి రెడీ? హిట్ అవుతుందా?

Purushottham Vinay
ప్రస్తుతం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ హవానే చాలా ఎక్కువగా కనిపిస్తుంది..మన తెలుగు వాళ్ళని ఇంకా మన తెలుగు సినిమాలను ఎప్పుడూ చిన్న చూపు చూసే బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఇప్పుడు మన తెలుగు సినిమాలే రక్ష గా మారాయి..బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొడుతున్న సమయం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అక్కడ కొత్త ఊపిరి పోసింది..కేవలం 3 కోట్ల రూపాయిల వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం బాలీవుడ్ నుండే ఏకంగా వంద కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి #RRR సినిమా అయితే ఏకంగా 300 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది..ఇప్పుడు వరుసగా ఖాన్స్ సినిమాలు సైతం బాగా బొక్కబోర్లా పడి అతి క్లిష్టమైన సమయాన్ని ఎదురుకుంటున్న సమయం లో బాలీవుడ్ ని ఆదుకున్న సినిమా నిఖిల్ హీరో గా నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం అని చెప్పాలి. ఇక ఈ సినిమా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా బాగా దున్నేస్తుంది.


దీనితో కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం భింబిసారా సినిమాని బాలీవుడ్ లో డబ్ చేసి రిలీజ్ చెయ్యడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నాడు..టాలీవుడ్ లో జులై నెలలో విడుదలైన సినిమాలన్నీ కూడా దారుణమైన పరాజయాలు పాలై అతి నీచమైన పరిస్థితి ని ఎదురుకుంటున్న కి భింబిసారా చిత్రం అయితే కొత్త ఊపిరి ని పోసింది..కేవలం రెండు వారాల్లోనే 34 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.ఇప్పుడు ఇదే సినిమాని బాలీవుడ్ లో తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తే కచ్చితంగా అక్కడ కూడా సూపర్ హిట్ సాధిస్తుంది అనే నమ్మకం తో ఉన్నాడట కళ్యాణ్ రామ్..త్వరలోనే భింబిసారా హిందీ వెర్షన్ కి సంబంధించిన వివరాలను ఆయన అధికారికంగా ప్రకటించబోతున్నారు..భింబిసారా సినిమా హిందీ లో కనుక సూపర్ హిట్ అయితే భింబిసారా 2 సినిమాకి హిందీ లో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరుకు కూడా అదిరిపొయ్యే కలెక్షన్స్ వస్తాయి..ఇక బాలీవుడ్ లో సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: