చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అదరగొడుతున్న రేష్మి..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు బుల్లి తెరపై టాప్ యాంకర్ లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట రష్మి గౌతమ్ సినిమాలతో తన కెరీర్ మొదలు పెట్టింది. కాకపోతే రష్మి గౌతమ్ కు ఈ టీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ లభించింది. జబర్దస్త్ టీవీ షో కు చాలా సంవత్సరాల నుండి యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి గౌతమ్ జబర్దస్త్ తో పాటు అనేక టీవీ షో లకు కూడా యాంకర్ గా వ్యవహరించింది.
 

ఇది ఇలా ఉంటే రష్మి గౌతమ్ 'గుంటూర్ టాకీస్' మూవీ లో మొట్ట మొదటి సారి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో రేష్మి గౌతమ్ తన నటనతో , అంతకుమించిన హాట్ హాట్ అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం రష్మి గౌతమ్ టీవీ షో లకు యాంకర్ గా  వ్యవహరిస్తూనే సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే టీవీ షో లతో , సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ని కొనసాగిస్తున్న రష్మి గౌతమ్ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
 

అందులో భాగంగా ఇది వరకు ఎన్నో సార్లు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా కూడా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి.  తాజాగా రష్మి గౌతమ్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా రష్మి గౌతమ్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో పూల పూల సారీ ని కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: