అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో ఒకరు ఆయన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అల్లరి నరేష్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో కామెడీ సినిమా ల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం మాత్రమే కాకుండా , ఎన్నో సినిమాల్లో తన వైవిధ్యమైన నటనతో కూడా ప్రేక్షకులను కట్టి పడేశాడు .
 

మరీ ముఖ్యంగా అల్లరి నరేష్ తన కెరియర్ లో గమ్యం , నాంది మూవీలలో తన నట విశ్వరూపం చూపించాడు.  ఈ రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన నాంది మూవీ తో అల్లరి నరేష్ అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్ ప్రస్తుతం మరోసారి విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ను  మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టైటిల్ ని 'ఉగ్రం' గా చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లరి నరేష్ తన వీపుపై ఒక కత్తి పోటు తో ,  ఒంటి నిండా రక్తంతో ఉన్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. నాంది మూవీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: