ఎన్టీఆర్... కొరటాల మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అదేనట..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్ది రోజుల్లో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్క బోయే భారీ యాక్షన్ డ్రామా లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది . అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే ఒక మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 31 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేయనుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ భారీ యాక్షన్ సన్నివేశంతో కొనసాగనున్నట్లు , అలాగే ఈ ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశం సముద్రం నేపథ్యంలో సాగనున్నట్లు , అలాగే ఈ ఇంటర్వెల్ సన్నివేశం భారీ రేంజ్ లో అద్భుతంగా ఉండునట్లు,  సినిమాకే ఈ యాక్షన్ సన్నివేశం హైలైట్ గా నిలువనునట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. జనతా గ్యారేజ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే రెండవ సినిమా పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: